నాంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎసీఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నాంపల్లిలో నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం హర్షణీయం ఆన్నారు.