మిర్యాలగూడ మండల కేంద్రంలోని అపోలో రిచ్ ఆసుపత్రిలో గురువారం 13 ఏళ్ల బాలికకు శస్త్ర చికిత్స కోసం ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమైంది. సమాచారం తెలుసుకున్న స్థానిక మేధ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు నాగరాజు, నల్గొండకు చెందిన సూర్యరతన్ వెళ్లి రక్తదానం చేశారు. రక్తదానం చేసినందుకు పేషంట్ కుటుంబ సభ్యులు రక్తదాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడం ఒక సామాజిక బాధ్యతగా భావించి పలుమార్లు రక్తదానం చేస్తున్నామన్నారు.