మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. ఆదివారం గుడిపల్లి మండల పరిధిలోని పలుగు చెరువులోకి ఎమ్మెల్యే చేప పిల్లలను విడుదల చేశారు. గత ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని పట్టించుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి మరయ్య, సొసైటీ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.