పోచంపల్లి: రైతులను ప్రభుత్వం మోసం చేసింది: కిషన్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బుధన్ పోచంపల్లి మండలంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. రెండు గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. గత శాసనసభ ఎన్నికలో ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తుందని ప్రకటించారు. కానీ, 11 నెలలు అయినా ఇప్పటికే అమలు చేయలేదని అన్నారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ అని మోసం చేశారు అని అన్నారు.