Oct 30, 2024, 11:10 IST/
యూట్యూబర్ హర్షసాయికి ముందస్తు బెయిల్
Oct 30, 2024, 11:10 IST
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదని హర్షసాయి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన హైకోర్టు, అతడికి బుధవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని బాధితురాలు తెలిపారు.