డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన ఇంకా ప్రారంభం కాలేదని, విధివిధానాలు కూడా ఇంకా ఖరారు కాలేదని అన్నారు. కావాలనే కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకేలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. అన్ని విషయాలు చెప్తున్నా బీజేపీపై కాంగ్రెస్ విషం కక్కుతుందని మండిపడ్డారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటూ అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.