పాలలో నీటితో పాటు ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వేడి చేసినప్పుడు ఇవన్నీ కలిసి పాల ఉపరితలంపై చిక్కటి పొర మాదిరి ఏర్పడుతుంది. ఇది ఆవిరిని బయటకు రానివ్వదు. దీంతో పీడనం పెరిగే కొద్దీ, ఆవిరి బయటకు వెళ్లడానికి చోటు లేక అది మీగడ పొరను బయటకు నెట్టేస్తుంది. దీంతో పాత్ర నుంచి పాలు పొంగి కింద పడుతాయి. కానీ నీటిలో ఇలా జరగదు. దాని ఉపరితలంపై ఎలాంటి పొర ఏర్పడని కారణంగా ఆవిరి సహజంగానే బయటకు వస్తుంది.