ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను సామాన్య క్రికెట్ ప్రేమికులే కాదు..సెలబ్రిటీల సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కొందరు నేరుగా స్టేడియంకు వెళ్లి వీక్షిస్తుండగా, మరికొందరు టీవీలలో చూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి దుబాయ్ స్టేడియంలో ప్రత్యక్షమయ్యారు. చిరంజీవి పెవిలియన్‌లో కూర్చుని ఆసక్తిగా మ్యాచ్ వీక్షిస్తూ టీవీ స్క్రీన్‌పై పలుసార్లు కనిపించారు.