నారాయణఖేడ్: 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు శిబిరాలు
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈనెల 23, 24 తేదీల్లో ప్రత్యేక ఓటరు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని చెప్పారు. కొత్త ఓటరు నమోదు, అడ్రస్ మార్పు తదితర వాటికోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.