జహీరాబాద్: నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం
విద్యార్థుల నుంచి స్కూల్ ఇన్నోవేషన్ మారతాన్ కార్యక్రమం ద్వారా ఆవిష్కరణలకు ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణలు ఉండాలన్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు. ఈనెల 30లోపు http:// school innovationmarathon. org. in వెబ్సైట్ లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.