ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పి రూపేష్ సోమవారం తెలిపారు. పోలీసుల త్యాగాలు, ప్రతిభ వెలికి తీసే విధంగా ఇటీవల తీసిన 3 ఫోటోలు, 3 నిమిషాల నిడివి ఉన్న షార్ట్ ఫిలింను ఈ నెల 21 లోపు జిల్లా పోలీసు కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. పూర్తి వివరాలకు 87125 39040 నెంబర్ కు సంప్రదించాలని సూచించారు.