జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.