మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రం - 2లో తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ వారోత్సవాలలో భాగంగా తల్లి ముర్రుపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ శశికళ, ఆయమ్మ సరిత, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.