మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులోని డ్రైనేజీ పైకప్పు పనులను శుక్రవారం ఉదయం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గాప్ప గారి అశోక్ గౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎరుకల యాదగిరి, మేనేజర్ మధుసూదన్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, సబ్ ఇంజనీరింగ్ భూపాల్, వార్డ్ ఆఫీసర్ పరశురాం రెడ్డి, జవాన్ ఎల్లం, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.