మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు సండ్ర నాగరాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సందర్బంగా బండారి గంగాధర్ పిల్లుట్ల గ్రామ కమిటీ అధ్యక్షుడు రాఘవ రెడ్డి, మాజీ సర్పంచ్ సులోచన నర్సింహారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎల్ఐసీ చెక్కును బాధిత కుటుంబానికి గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంగళపర్తి నాగయ్య, రాములు, సండ్ర లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.