నిజాంపేట: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమం: ఎస్సై

61பார்த்தது
మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మేలుకొలుపు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి మూఢనమ్మకాలు, బాణావతి, మంత్రాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி