తెలంగాణ ప్రభుత్వం ఐటి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు జన్మదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ నాయకులు సేవ కార్యక్రమాలతో పాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనాధ ఆశ్రమంలో అన్నదానం పాటు ఎన్టీఆర్ నగర్లో శ్రమదానం చేశారు. ఎమ్మెల్యే తనయుడు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు తో పాటు కౌన్సిలర్లు నాయకులు పల్లపు తిరుపతి, గాదె సత్యం, బోడ రినాధర్మేందర్, చంద్రశేఖర్ హండే, హనుమంతరావు, కాజామియా, గొంగల్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.