బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి సంస్థకే కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం మందమర్రి ఏరియాలోని కేకే- 5, ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, జీఎం కార్యాలయంలలో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలంపాట ద్వారా కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలకు పూనుకుందని ఆరోపించారు.
Where: మందమర్రి