సింగరేణిలో నర్సరీ, సులబ్ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఈ నెల 28న కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముట్టడించనున్నట్లు సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డి. బ్రహ్మానందం తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సులబ్ కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యం, నర్సరీ కార్మికులకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని యాజమాన్యం అమలు చేయడం లేదన్నారు.