కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సమీకృత పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి, సమన్వయ పరిరక్షణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 163వ జాతీయ రహదారుల ప్యాకేజీ నిర్మాణానికి అవసరమైన 164 ఎకరాల భూసేకరణ ప్రక్రియ సాగుతుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.