రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తున్న తెలంగాణ స్పెషల్ పోలీసు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణి చూపాలని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమిరిశెట్టి రాజు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మానసిక శారీరక హింసకు పాల్పడుతూ కుటుంబాలకు దూరం చేయడం సరికాదన్నారు. పోలీస్ కుటుంబాల మనోవేదనను అర్థం చేసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు.