మంచిర్యాల జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి నవంబర్ 30 సాయంత్రం 4 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వివరించారు.