అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు: బండ శాంకరి

1544பார்த்தது
అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు: బండ శాంకరి
అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారని మంచిర్యాల సఖి లైన్స్ క్లబ్ అధ్యక్షురాలు బండ శాంకరి అన్నారు. శనివారం వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి డిజిహెచ్ హరిచంద్ర రెడ్డి, స్వరూప హాస్పిటల్ డాక్టర్ శరత్ బాబు స్వరూప రాణి లతోపాటు డాక్టర్ వైష్ణవి నాగార్జున, హోమియోపతి డాక్టర్ రామకృష్ణ సరితలను సన్మానించారు. ఈ సందర్భంగా శాంకరి మాట్లాడుతూ వైద్యుల సేవలుసమాజంలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. వైద్యం అంటే వృత్తి కాకుండా మనుషులను బ్రతికించే మహాశక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ కరుణ, ట్రెజరర్ మహేశ్వరి, జాయింట్ సెక్రెటరీ శివరాణి, కోఆర్డినేటర్ కట్ల భాగ్యలక్ష్మి, చక్రధర్, ప్రాథమిక సభ్యులు స్వర్ణ, కలిశా తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி