మంచిర్యాలలో త్వరితగతిన ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోరిగం వెంకటస్వామి, ఈ. హనుమంతు కోరారు. ఈ సంవత్సరం ఇంకా ఇసుక రీచ్ ప్రారంభించకపోవడంతో ట్రాక్టర్లకు పని లేకుండా పోయిందని తెలిపారు. ఫైనాన్స్ కట్టలేని, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వివరించారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు స్పందించి వెంటనే ఇసుక రీచ్ ప్రారంభించాలని కోరారు.