గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భాగంగా కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తామని ఏఐటీయూసి అద్యక్షుడు సీతారామయ్య తెలిపారు. మంగళవారం ఆర్కే 5 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కార్మికుల్లో ఏఐటియుసికి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కొన్ని సంఘాలు లాభాల వాటాపై తప్పుడు ప్రచారాలు చేశాయని విమర్శించారు. తాము గెలిచాక కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామన్నారు.