ప్రజాపాలనలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రూ. 500 గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రాయితీ గ్యాస్ అందని వారు 1967, 180042500333 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. గ్యాస్ రాయితీపై లబ్ధిదారుల అర్హత వివరాలు, రాయితీ నగదు తెలిపే పత్రాలు అందించినున్నట్లు పేర్కొన్నారు.