దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ గ్రామానికి చెందిన ఏ. వెంకటేష్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీని బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అందజేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఎల్ఓసీ అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.