మంచిర్యాల బ్లేడు ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షునిగా బోరిగం రాజును ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులు తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎల్లవేళల అసోసియేషన్ తరపున తాను సేవ చేస్తానని తెలియజేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా రుక్కం తిరుమల్, ప్రధాన కార్యదర్శిగా వీర్ల శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని శాలువాతో సన్మానించారు.