మంచిర్యాల మున్సిపాలిటీలోని 9వ వార్డు ఆండాలమ్మ కాలనీలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 100 మందికి కోవిడ్ బూస్టర్ డోస్ వేశారు. అలాగే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించి వైద్య శిబిరం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునీత కిషన్ తోపాటు మహేందర్ రెడ్డి, సత్తిబాబు, సదానందం, దారంగుల వెంకటేష్ తదితరులు ఉన్నారు.