సింగరేణిలోని కాంట్రాక్టు కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నట్లు మందమర్రి ఏరియా ఎస్ ఓ టు జి ఎం విజయ ప్రసాద్ తెలిపారు. ఏరియా జిఎం కార్యాలయంలో సోమవారం కాంట్రాక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాంట్రాక్ట్ కార్మికులు హెచ్డిఎఫ్ సీ బ్యాంకులో జీరో అకౌంట్ తీసుకోవాలన్నారు.