కోటపల్లి మండలంలోని సుపాక గ్రామ శివారు ప్రాణహిత నది వద్ద కోడిపందేల స్థావరాలపై శనివారం రాత్రి దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు. మూడు కోడి పుంజులు, 9 సెల్ ఫోన్లు, 16, 810 నగదు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కోడి పందేలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.