కడుపునొప్పి భరించలేక తొమ్మిదో తరగతి విద్యార్థి సోమవారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీధర్ తెలిపారు. వీణవంక మండలానికి చెందిన ఓ వ్యక్తి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాంటాక్ట్ కార్మికుల పనిచేస్తూ ఇక్కడే కుటుంబ సభ్యులతో జీవిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న కుమారుడు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.