జైపూర్ మండలం నర్వ గ్రామంలో రూ. 10 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్ మరియు డ్రెయిన్ పనులను బుధవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.