జైపూర్ సింగరేణి విద్యుత్ థర్మల్ కేంద్రంలో బొగ్గు మండించగా వెలువడే వాయువు నుంచి రోజుకు 500 కిలోల పరిమాణం గల కార్బన్ డయాక్సైడ్ ను సేకరించి మిధనాల్ ద్రవాన్ని ఉత్పత్తి చేయనున్నది. ఈ ప్లాంట్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభం కాగా డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. ప్రయోగం అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.