జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్న పలువురిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఇందారంలోని ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎస్సై శ్రీధర్ పోలీసులతో కలిసి తనిఖీ చేయగా తవ్వకాల ఆనవాళ్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని తవ్వకాలు జరిపిన గడ్డపార, తట్ట, పారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.