వేమనపల్లి మండలం నీల్వాయి పంచాయతీ పరిధిలోని కొత్తగూడ గ్రామానికి చెందిన భీమయ్య, రామయ్య, దుర్గయ్య, లక్ష్మయ్య, సమ్మయ్య, మల్లేష్ మధుకర్ లు పోడు భూమి కోసం అడవిని నరికి ధ్వంసం చేస్తున్నారని కేసు నమోదు చేసినట్లు నిల్వాయి రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. అటవీ అధికారులు ప్రమోద్, మహిపాల్ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి వారిని అడ్డగించినట్లు పేర్కొన్నారు.