ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ శ్వేతా కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని 10, 11 వార్డులకు చెందిన ప్రజలకు పెద్దనపల్లి ఏరియాలో వరల్డ్ సైట్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.