మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించబోయే పట్టణ భరోసా బాట కార్యక్రమాలకు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ లుగా ఎల్తూరి శంకర్, పైడిమల్ల చంద్రశేఖర్, మద్దెల గోపిలను నియమించినట్లు ఆ సంఘం నాయకులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు, పట్టణంలోని ప్రజల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామన్నారు.