ఈనెల 18న బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు అన్ని శాఖల అధికారులు హాజరై ఫిర్యాదులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.