మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ గ్రౌండ్లో సోమవారం రాత్రి నిర్వహించిన లక్ష దీపోత్సవానికి భారీ ఎత్తున మహిళలు తరలివచ్చారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని భక్తులు హాజరై దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మైదానం మొత్తం శివనామస్మరణతో మారుమోగింది.