బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి సిఈఆర్ క్లబ్ లో కాంటాక్ట్ ఉద్యోగులకు హెచ్డిఎఫ్సి ఎకౌంటు ఓపెనింగ్ మేళాను ఎస్ఓటు జిఎం రాజమల్లు బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రయోజనాల కోసమే ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంకుతో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకుందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 30 లక్షల బీమా సౌకర్యం, జీరో బ్యాలెన్స్ అకౌంట్ వంటి వివిధ రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నారు.