సమాజంలో ప్రజలంతా కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని తొమ్మిదవ వార్డు పరిధిలో దుర్గామాత ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి వారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, ఆలయ కమిటీ అధికారులు పాల్గొన్నారు.