బెల్లంపల్లి పట్టణ శివారు పోచమ్మ చెరువు స్మశాన వాటిక వద్ద ట్యాంకుపై ఉన్న తేనె తుట్టెను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తొలగించారు. గత కొన్ని నెలలుగా స్మశానానికి అంత్యక్రియలకు వచ్చిన వారిపై తేనె తుట్టెలు కుట్టడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. పలు ఫిర్యాదులు మున్సిపాలిటీకి అందడంతో మున్సిపల్ అధికారులు స్పందించి తేనె తుట్టెను తొలగించారు.