బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సీపీఐ పట్టణ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వినతి పత్రం సమర్పించారు. కాకా వెంకటస్వామి పేరును పెట్టాలని కౌన్సిల్ తీర్మానం చేశారని దానిని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.