గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లకు అటవీశాఖ అనుమతి ఇప్పించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డోక్రియాల్ ను కోరారు. బుధవారం హైదరాబాదులో ఆయనను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిసి అటవీ శాఖకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు ఇంకా పోలేదని, ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.