బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని దేవిపూర్ అటవీ రేంజ్ ను బెల్లంపల్లి డివిజన్ లో విలీనం చేయాలని ఎంసిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీశాఖ కన్జర్వేటివ్ కాంతారావు కు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండే దేవాపూర్ రేంజ్ ను ఇతర డివిజన్లో చేర్చడం సరికాదన్నారు.