బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గని సింగరేణి సంస్థకు ప్రయోగశాలగా మారిందని ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ ఆరోపించారు. గని ఫిట్ కార్యదర్శి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ అధ్యక్షతన గని ఆవరణలో నిర్వహించిన గేట్ మీటింగ్కు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.