ఇంటింటి సర్వేను సమగ్రంగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో నిర్వహిస్తున్న సర్వేను బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. కలెక్టర్ సర్వే సిబ్బందితో మాట్లాడుతూ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు.