ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ లకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిఎంఅండ్ హెచ్ వో హరీష్ రావు సూచించారు. మంగళవారం బెల్లంపల్లి వంద పడకల దవాఖానాలో బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వైద్య సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య సేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ రిజిస్టర్లు మెయింటైన్ చేయాలని సూచించారు.