మధ్యప్రదేశ్‌లోని రేవాలో షాకింగ్ ఘటన జరిగింది. భార్య కళ్ల ముందే భర్త ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ప్రకాశ్ త్రిపాఠి (26)కు ప్రియా శర్మకు రెండేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లైనప్పటి నుంచి భార్య వేధిస్తుండడంతో త్రిపాఠి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సూసైడ్ చేసుకోవడానికి ముందు భార్య, ఆమె తల్లికు వీడియో కాల్ చేయగా వారు చూస్తూ ఉండిపోయారు తప్ప అతడిని రక్షించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.